‘చిరు’ప్రాయంలోనే ఆ స్టైల్‌ని ఇమిటేట్ చేసిన తేజ్

Wed,July 13, 2016 01:01 PM

మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై ఆయన కనపడితే చాలు థియేటర్లు ఈలలు గోలలతో దద్దరిల్లిపోయేవి. చిరుని బయటవారే కాదు తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఇప్పటి టాప్ హీరోలుగా ఉన్న పవన్, బన్నీ, చరణ్, సాయిధరమ్, వరుణ్ తేజ్‌లు లు ఆయన వేసిన దారిలోనే నడిచి స్టార్స్‌గా ఎదిగారు. ఈ విషయాన్ని మెగా హీరోలు పలుమార్లు అనేక ఫంక్షన్స్‌లో చెప్పారు కూడా.


అయితే మెగాస్టార్ చిరంజీవికి ఓ స్టైల్ ఉంటుంది. ఆయన డైలాగ్‌లో ఓ పవర్ ఉంటుంది. వేసే స్టెప్పులోను ఓ రిథమ్ ఉంటుంది. అందుకే మెగాస్టార్‌ని ఇమిటేట్ చేయాలని కొందరు ప్రయత్నించిన అది ఎవరి వలన సాధ్యం కాలేదు. అయితే మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన చిన్న తనంలోనే చిరు స్టైల్ ని ఇమిటేట్ చేశాడు. గ్యాంగ్ లీడర్ చిత్రంలో ‘చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో .. రఫ్ ఆడించేగలను’ అనే డైలాగ్‌ని చిరు తన చొక్కా కాలర్ పైకి ఎత్తి చెబుతాడు. ఈ డైలాగ్, ఆ స్టైల్ .. అప్పట్లో ప్రభంజనం. ఇదే స్టైల్ ని చిన్న వయస్సులో అనుకరించే ప్రయత్నం చేసానంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. ఆ పోస్ట్‌లో చోటా గ్యాంగ్ లీడర్‌ని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

5348
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles