‘4 బుల్లెట్లు సంపాదిస్తే 2 కాల్చుకోవాలె..2 దాచుకోవాలె’..వాల్మీకి టీజర్

Thu,August 15, 2019 07:18 PM
Varun Tej Valmiki Teaser REVEALED TODAY


టాలీవుడ్ యాక్టర్ వ‌రుణ్ తేజ్ తాజాగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వాల్మీకి అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ జిగ‌ర్తాండ‌కి రీమేక్‌గా ఈ ప్రాజెక్టు తెర‌కెక్కుతుంది. స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రయూనిట్ వాల్మీకి టీజర్ ను విడుదల చేసింది. నా సినిమాలో విలనే నా హీరో అనే డైలాగ్స్ తో టీజర్ షురూ అవుతోంది. అందుకే పెద్దోళ్లు చెప్పిన్రు. 4 బుల్లెట్లు సంపాదిస్తే 2 కాల్చుకోవాలే..2 దాచుకోవాలె అంటూ వరుణ్ తేజ్ చెప్పే సంభాషణలు టీజర్ కు హైలైట్ గా నిలుస్తున్నాయి. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

2957
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles