బిగ్‌బాస్‌ని త‌న ఇంటికి ఆహ్వానించిన వ‌రుణ్ నాన‌మ్మ‌

Fri,October 18, 2019 08:21 AM

బిగ్ బాస్ సీజన్ 3 ఎపిసోడ్ 89కి హైలైట్ వ‌రుణ్ నాన‌మ్మ రాజ్య‌ల‌క్ష్మి అని చెప్ప‌వ‌చ్చు. సైలెంట్‌గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆవిడ త‌న మాట‌ల‌తో ఇంటి స‌భ్యుల హృద‌యాల‌ని గెలుచుకున్నారు. బ‌య‌టి విష‌యాలు, ఇంట్లోని విష‌యాల గురించి చ‌క్క‌గా చెబుతూ చూపు తిప్ప‌కుండా చేసింది. నెయిల్ పాలిష్‌తో పాటు చ‌క్క‌గా మేక‌ప్ వేసుకొని ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్య‌ల‌క్ష్మిని చూసి అంద‌రు ఇంటి స‌భ్యులు తెగ సంతోషించారు. ప్ర‌తి ఒక్క‌రిని పేరు పేరున ప‌ల‌క‌రించి చ‌క్క‌గా ఆడుతున్నారు. ఇలానే ఆడి ట్రోఫీ గెలుచుకోండి అని ఇంటి స‌భ్యుల‌కి సూచించారు.


ఇక బాబా భాస్క‌ర్ పెట్టిన కాఫీ తాగుతూ..బిగ్ బాస్ మా ఇల్లు మాస‌బ్ ట్యాంక్ ద‌గ్గ‌ర‌. మీరు త‌ప్ప‌క రావాలి. మీరు రాక‌పోయిన క‌నీసం మీ ఫోటో అయిన పంపండి. మీ గురించి చెబుదామ‌ని చాలా రాసుకున్నా. కాని దానిని తీసుకురానివ్వ‌లేదు అని చెప్పుకొచ్చారు బామ్మ‌. ఒక‌వేళ త‌న‌కి ఛాన్స్ వ‌స్తే త‌ర్వాతి బిగ్ బాస్ సీజ‌న్‌లో పార్టిసిపేట్ చేస్తాన‌ని అన్నారు వ‌రుణ్ నాన‌మ్మ‌. బామ్మ మాట‌లు ప్ర‌తి ఒక్క‌రికి ఫుల్ ఎన‌ర్జీని ఇచ్చాయి.

కొద్ది సేప‌టి త‌ర్వాత రాహుల్ తల్లి సుధారాణి క‌న్ఫెష‌న్ రూంలోకి వ‌చ్చారు. అక్క‌డి నుండే రాహుల్‌ని పిలుస్తుండ‌గా, అప్ప‌టికి ఫ్రీజ్ మోడ్‌లో ఉన్న‌ రాహుల్ త‌ల్లి ద‌గ్గ‌ర‌కి వెళ్ళ‌లేక‌పోయాడు. రిలీజ్ అన్న త‌ర్వాత క‌న్ఫెష‌న్ రూంలోకి వెళ్ళి త‌న త‌ల్లిని గ‌ట్టిగా హ‌త్తుకొని సంతోషించాడు. శ్రీముఖి అల్ల‌రి త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని సుధారాణి చెప్పుకొచ్చారు. గేమ్ మంచిగా ఆడ‌మ‌ని, డ్యాన్స్‌లు, పాట‌లు పాడాల‌ని త‌న కొడుకుకి సూచించారు సుధా. తల్లి కోసం పెద‌వే ప‌లికిన మాట‌ల‌లో తీయని మాటే అమ్మ‌.. అనే పాట పాడాడు రాహుల్‌. నాగార్జునకి కూడా ఓ సాంగ్ డెడికేట్ చేయాల‌ని సుధారాణి.. రాహుల్‌ని కోరింది.

ఇక కాసేప‌టి త‌ర్వాత శ్రీముఖి త‌ల్లి ల‌త కోర్డు యార్డ్‌లోని డోర్ నుండి ఇంట్లోకి వ‌స్తూ.. పాప పాప అని అరిచారు. ఇంత‌లో త‌ల్లి ద‌గ్గ‌రకు ఉరికి వ‌స్తున్న శ్రీముఖిని ఫ్రీజ్ కావాల‌ని బిగ్ బాస్ సూచించారు. త‌ల్లిని చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్న స‌మ‌యంలో వచ్చిన దారినే బయటకు వెళ్లాలని బిగ్ బాస్ ఆదేశించ‌డంతో శ్రీముఖి బోరు బోరున ఏడ్చింది. ఆమె ఏడుపుకి బిగ్ బాస్ టాప్ లేచిపోయిందనే చెప్ప‌వ‌చ్చు. అయితే ఆమె అలా ఏడుస్తూనే ఉన్న స‌మ‌యంలో మ‌రో డోర్ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టింది శ్రీముఖి తల్లి లత.

చాలా రోజుల త‌ర్వాత త‌ల్లి కనిపించే స‌రికి ఆమెని హ‌త్తుకొని బోరున ఏడ్చేసింది. కోర్డ్ యార్డ్‌లోకి తీసుకెళ్లి త‌ల్లితో చిన్న పిల్ల‌లా ప్ర‌వ‌ర్తించింది. అప్పుడే ఏడుపు అంత‌లోనే న‌వ్వు.. ఇన్నాళ్ళు స్ట్రాంగ్‌గా క‌నిపించిన శ్రీముఖి త‌ల్లిని చూసి అంత‌గా ఎమోష‌న్ అయ్యే స‌రికి ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్య‌పోయారు. శ్రీముఖికి ప‌లు సూచ‌న‌లు చేసిన ల‌త ఆ త‌ర్వాత రాహుల్‌తో గొడ‌వ ప‌డ‌కుండా గేమ్ ఆడాల‌ని సూచించింది. మాట్లాడుకోండి త‌ప్ప పోట్లాడుకోవ‌ద్దు అని ల‌త అన‌డంతో టాస్క్‌ల వ‌ర‌కే అలా ఉంటాం త‌ప్ప మిగ‌తా స‌మయంలో అంద‌రం ఫ్రెండ్స్‌లానే క‌లిసి ఉంటాం రాహుల్ అన్నాడు.

వెళ్ళే ముందు ల‌త .. శ్రీముఖికి నువ్వు నువ్వులానే ఉండు. కాస్త డ్యాన్స్ చేయి. ఎవ‌రేమ‌న్నా సైలెంట్‌గా ఉండు అని కొన్ని స‌ల‌హాలు ఇచ్చింది. అయితే బిగ్ బాస్ హోట‌ల్‌కి వ‌చ్చిన అతిధులు అంద‌రు స్టార్ రేటింగ్ ఇవ్వ‌డంతో మూల‌న‌ప‌డ్డ‌ హోట‌ల్ ఇప్పుడు 7 స్టార్ హోట‌ల్‌గా మారింది. టాస్క్ అంద‌రు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయ‌డంతో ఇంటి స‌భ్యుల‌కి ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ ల‌భించ‌నుంది.

3211
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles