బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ కొత్త చిత్రం

Thu,October 10, 2019 07:49 PM

వ‌రుణ్ తేజ్ హీరోగా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. గురువారం హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్ దైవ స‌న్నిధానంలో కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి నాగ‌బాబు క్లాప్ కొట్ట‌గా, కొణిదెల సురేఖ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అల్లు అర‌వింద్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అల్లు అర‌వింద్‌, అల్లు బాబీ, సిద్ధు ముద్ద క‌లిసి హీరో వ‌రుణ్ తేజ్‌, డైరెక్ట‌ర్ కిరణ్ కొర్ర‌పాటికి స్క్రిప్ట్‌ను అందించారు.


ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్రపాటి మాట్లాడుతూ అల్లు అరవింద్‌గారి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్ నిర్మాణంలో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాం. డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ప్రాధాన్య‌త‌నిచ్చే వ‌రుణ్ తేజ్‌ క‌థ విన‌గానే వెంట‌నే ఓకే చెప్పారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్ర‌మిది. ఈ సినిమా కోసం అమెరికాకు వెళ్లి ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ తీసుకుని వ‌రుణ్‌ చాలా మేకోవ‌ర్ అయ్యారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీతం అందిస్తుండగా..జార్జ్ సి.విలియ‌న్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె.వెంక‌టేశ్‌ ఎడిటింగ్ వ‌ర్క్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. సినిమాలోని మిగ‌తా న‌టీనటులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామని అన్నారు.

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేశ్ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.


1053
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles