సాయిపల్లవిని పెళ్లి చేసుకుంటాడట..!

Mon,September 23, 2019 06:17 PM


‘గద్దలకొండ గణేశ్’ చిత్రంతో మంచి హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న వరుణ్ తేజ్ ఇటీవలే మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఫీట్ అప్ విత్ స్టార్స్ రియాల్టీ షోలో పాల్గొన్నాడు. ఫన్నీగా సాగిన ఈ షోలో వరుణ్ తేజ్ ను మంచు లక్ష్మి పలు ప్రశ్నలు వేసింది.


రాశీఖన్నా, సాయిపల్లవి, పూజాహెగ్డే..ఈ ముగ్గురు హీరోయిన్లలో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావ్..? ఎవరిని చంపుతావ్ ? ఎవరితో డేటింగ్ చేస్తావ్ ? అని అడిగింది. దీనికి వరుణ్ తేజ్ స్పందిస్తూ.. తాను సాయిపల్లవిని పెళ్లి చేసుకుంటానని, రాశీఖన్నాను చంపుతానని, పూజాహెగ్డేతో డేటింగ్ కు వెళ్తానని చెప్పాడు. వరుణ్ తేజ్-సాయిపల్లవి కాంబినేషన్ లో ఫిదా సినిమా వచ్చిన విషయం తెలిసిందే. రాశీ ఖన్నాతో కలిసి తొలిప్రేమ, పూజా హెగ్డేతో ముకుందా, గద్దలకొండ గణేశ్ చిత్రాల్లో నటించాడు వరుణ్ తేజ్.

8423
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles