వెంక‌టేష్ అభినంద‌న‌ల‌తో ఎగిరి గంతేసిన హీరో

Sat,June 29, 2019 12:09 PM
venkatesh applause  to sri vishnu

కెరీర్‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న న‌టుడు శ్రీ విష్ణు. నీది నాదీ ఒకే క‌థ చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్న శ్రీ విష్ణు రీసెంట్‌గా బ్రోచేవారెవ‌రురా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మెంట‌ల్ మ‌దిలో వంటి చిత్రాన్ని తెర‌కెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా, ఇందులో నివేదా థామస్ .. నివేదా పేతురాజ్ కథానాయికలుగా న‌టించారు. సత్యదేవ్ .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కుమార్ మ‌న్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకుంది. న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్‌తో పాటు కామెడీ, క‌థ‌, క‌థ‌నం సినిమా మంచి విజ‌యం సాధించ‌డంలో భాగ‌మ‌య్యాయి. విమ‌ర్శ‌కులు ఈ సినిమాపై ప్రశంస‌లు కురిపిస్తున్నారు. విక్ట‌రీ వెంక‌టేష్‌కి కూడా ఈ చిత్రం బాగా న‌చ్చ‌డంతో శ్రీ విష్ణుకి కాల్ చేసి అభినందించార‌ట‌. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా తెలిపిన శ్రీ విష్ణు ఓ ఫోటో కూడా షేర్ చేశాడు. ఈ ఉద‌యం వెంక‌టేష్‌గారి అభినంద‌న‌తోనే మొద‌లైంద‌ని ఆయ‌న పోస్ట్‌లో తెలిపాడు.


3827
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles