ఫలక్ నుమా దాస్ ట్రైలర్‌పై వెంకీ కామెంట్స్

Mon,May 13, 2019 09:23 PM
VENKATESH COMMENTS ON fALAKNUMADAS movie trailer


ఫలక్ నుమా దాస్ సినిమా సహజత్వాన్ని ప్రతిబింబించే విభిన్నమైన సినిమా అని టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేశ్ అన్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ను వెంకటేష్‌ విడుదల చేశాడు. ఈ సందర్భంగా వెంకీ మాట్లాడుతూ..ఫలక్ నుమా దాస్ యువతరాన్ని మెప్పిస్తుంది. హైదరాబాద్‌ నగర సిసలైన సంస్కృతిని ఈ సినిమాలో చూపించారు. చిత్ర టీజర్‌, ట్రైలర్‌ వినూత్నంగా ఉన్నాయి. యువత జీవితాల్లోని ఒడిదుడుకుల్ని ఆసక్తికరంగా చూపించారు అని అని అన్నారు. విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘ఫలక్‌నుమా దాస్‌' ను కరాటే రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సలోని మిశ్రా, హర్షిత గౌర్‌, ప్రశాంతి చారులింగ హీరోయిన్లు.

2174
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles