రీమేక్ విష‌యంలో వెనుక‌డుగు వేస్తున్న వెంకీ ..!

Fri,September 27, 2019 01:21 PM

రీమేక్ చిత్రాల‌తో మంచి విజ‌యాల‌ని అందుకుంటూ కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన విక్టరీ వెంక‌టేష్ ఈ సారి రీమేక్ విష‌యంలో కాస్త వెనుక‌డ‌గు వేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇటీవ‌ల హిందీలో విడుద‌లై మంచి విజయం సాధించిన ‘దేదే ప్యార్‌ దే’అనే చిత్రాన్నివెంకీ రీమేక్ చేస్తున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి . బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్, పంజాబీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్, అల‌నాటి అందాల భామ ట‌బు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ‘దేదే ప్యార్‌ దే’అనే చిత్రం తెర‌కెక్కిన‌ సంగ‌తి తెలిసిందే. అకివ్ అలీ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 50 ఏళ్ళ వ్య‌క్తి 26 ఏళ్ళ అమ్మాయితో లండన్‌లో ప్రేమలో పడతారు. వారి కుటుంబ సభ్యుల ఆశీర్వాదం కొరకు వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు సాగే జ‌ర్నీ నేప‌థ్యంలో చిత్రాన్ని తెర‌కెక్కించారు.


జావెద్ జాఫ్రే, జిమ్మీ శ్రేఘిల్‌, అలోక్ నాథ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ‘దేదే ప్యార్‌ దే’ చిత్రం మే 17న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రానికి మంచి టాక్ రావ‌డంతో వెంకీ రీమేక్ చేయాల‌ని భావించాడు. సురేష్ బాబు కూడా దేదే ప్యార్ దే చిత్రాన్ని వెంకీ రీమేక్ చేయ‌బోతున్నాడనే విష‌యంపై అప్ప‌ట్లో క్లారిటీ ఇచ్చారు. కాని ప్ర‌స్తుతం ఈ చిత్ర రీమేక్ విష‌యంలో వెంక‌టేష్ కాస్త ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తుది. అందుకు కార‌ణం నాగార్జున న‌టించిన మ‌న్మ‌థుడు 2 చిత్రం. మిడిల్ ఏజ్ వ్య‌క్తి కుర్ర భామ ప్రేమ‌లో ప‌డడం అనే స్టోరీ లైన్‌తో రూపొందిన ఈ చిత్రంకి పెద్ద‌గా ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించ‌లేదు. దేద ప్యార్ దే కూడా అదే కాన్సెప్ట్‌తో రూపొందిన నేప‌థ్యంలో చిత్రం స‌క్సెస్ అవుతుందా లేదా అనే దానిపై వెంకీ ఆలోచ‌న‌లు చేస్తున్నాడ‌ట‌. మ‌రోవైపు వెంకీ న‌టించిన వెంకీమామ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఆ త‌ర్వాత త్రినాధ‌రావు న‌క్కిన‌, త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్స్ చేయ‌నున్నాడు.

2869
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles