మ‌రో రీమేక్‌పై క‌న్నేసిన వెంక‌టేష్

Thu,June 6, 2019 08:15 AM
venkatesh remakes De De Pyaar De

రీమేక్ చిత్రాల‌కి కేరాఫ్ అడ్రెస్ విక్ట‌రీ వెంక‌టేష్‌. మాలీవుడ్, కోలీవుడ్‌, బాలీవుడ్ చిత్రాల‌ని రీమేక్ చేసి మంచి విజ‌యాలు సాధించాడు వెంకీ. తాజాగా ఆయ‌న మ‌రో రీమేక్‌పై క‌న్నేశాడు. ఇటీవ‌ల హిందీలో విడుద‌లై మంచి విజయం సాధించిన ‘దేదే ప్యార్‌ దే’అనే చిత్రాన్ని రీమేక్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్, పంజాబీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్, అల‌నాటి అందాల భామ ట‌బు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ‘దేదే ప్యార్‌ దే’అనే చిత్రం తెర‌కెక్కిన‌ సంగ‌తి తెలిసిందే. అకివ్ అలీ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 50 ఏళ్ళ వ్య‌క్తి 26 ఏళ్ళ అమ్మాయితో లండన్‌లో ప్రేమలో పడతారు. వారి కుటుంబ సభ్యుల ఆశీర్వాదం కొరకు వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు సాగే జ‌ర్నీ నేప‌థ్యంలో చిత్రాన్ని తెర‌కెక్కించారు. జావెద్ జాఫ్రే, జిమ్మీ శ్రేఘిల్‌, అలోక్ నాథ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం మే 17న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రానికి మంచి టాక్ రావ‌డంతో వెంకీ రీమేక్ చేయాల‌ని భావించాడు. సురేష్ బాబు తాజాగా వెంకీ దేదే ప్యార్ దే చిత్రాన్ని వెంకీ రీమేక్ చేయ‌బోతున్నాడనే విష‌యంపై క్లారిటీ ఇచ్చారు. అతి త్వ‌రలోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.

2068
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles