రానున్న కాలంలో వెంకీ హంగామా మూములుగా లేదు

Thu,June 6, 2019 02:00 PM
venki hungama very soon

కుర్ర హీరోల‌లో నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వారికి ఏ మాత్రం త‌గ్గ‌కుండా సీనియ‌ర్ హీరో వెంక‌టేష్ కూడా మంచి చిత్రాల‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. మొన్న‌టికి మొన్న ఎఫ్‌2 అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించిన వెంకీ త్వ‌ర‌లో వెంకీమామ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ ఏడాది చివ‌ర‌లో ఈ మూవీ విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రం తర్వాత వెంకీ బాలీవుడ్ చిత్రం దేదే ప్యార్ దే చిత్రం రీమేక్ చేయ‌నున్నాడ‌ట‌. వీటితో పాటు ‘నేను లోకల్, సినిమా చూపిస్తా మామ’ ఫేమ్ త్రినాథరావ్ నక్కిన డైరెక్షన్లో ఓ చిత్రం ఉంటుందట. అలాగే ఇంకో సినిమా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు నిర్మిస్తారట. వీటిని త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. ఈ వార్త‌ల‌ని బ‌ట్టి చూస్తుంటే రానున్న రోజుల‌లో వెంకీ వ‌రుస సినిమాల‌తో ఫుల్ సంద‌డి చేయ‌నున్నాడ‌ని తెలుస్తుంది.

1753
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles