500మందితో భారీ యాక్ష‌న్ సీన్ ప్లాన్

Wed,July 31, 2019 09:02 AM
Venky Mama mela fight with 500 artists

విక్ట‌రీ వెంక‌టేష్ అత‌ని మేన‌ల్లుడు నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న చిత్రం వెంకీమామ‌. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ని ఉగాది పండుగ సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. ఇందులో త‌న మామ భుజంపై చైతూ చేయి వేయడం, ప‌క్క‌న ఉన్న బుల్లెట్ పై జై జ‌వాన్ అని రాసి ఉండ‌డం సినిమాపై ఆస‌క్తిని క‌లిగించింది. ఈ చిత్రం ఓ వైపు పల్లెటూరి వాతావరణం.. మరోవైపు యుద్దవాతావరణం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న‌ట్ట‌గా స‌మాచారం. సురేశ్‌ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ శివార్ల‌లో జ‌రుగుతుంది. మేళాలో 500మంది జూనియ‌ర్ ఆర్టిస్ట్స్‌తో పాటు ఫైట‌ర్స్‌తో భారీ యాక్ష‌న్ సీన్‌ని ప్లాన్ చేశార‌ట‌. రామ్ ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో రూపొంద‌నున్న ఈ ఫైట్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంద‌ని అంటున్నారు. ఈ ఫైట్ సీక్వెన్స్‌తో చిత్ర మేజ‌ర్ పార్ట్ పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. చిత్రంలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేఎస్‌ రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు. రియ‌ల్ లైఫ్‌లో మామ అల్లుళ్ళుగా ఉన్న చైతూ, వెంకీలు రీల్ లైఫ్‌లోను మామ అల్లుళ్ళుగా ఈ చిత్రంలో క‌నిపించ‌డం విశేషం. అయితే మామ‌ రైస్‌మిల్‌ యజమాని పాత్రలో సంద‌డి చేస్తే, అల్లుడు ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం.

1583
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles