ప్లాస్టిక్ వాడ‌కుండా బిగ్ బాస్ హౌజ్ రూప‌క‌ల్ప‌న‌

Tue,September 24, 2019 08:42 AM

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ దేశంలోని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇండియాలో ముందుగా హిందీలో ప్రారంభం కాగా, ఈ షో రీసెంట్‌గా ప‌ద‌మూడో సీజ‌న్‌లోకి అడుగుపెట్టింది. స‌ల్మాన్ హోస్ట్ చేస్తున్న ఈ కార్య‌క్ర‌మం బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈ షో కోసం రూపొందిన సెట్‌కి సంబంధించి కొన్ని విష‌యాలు బ‌య‌ట‌కి వ‌చ్చాయి. ఇవి ప్రేక్ష‌కుల‌కి ఆస‌క్తితో పాటు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి.


బిగ్ బాస్ హౌజ్‌ని 600 మంది కార్మికులు ఆరు నెల‌ల పాటు శ్ర‌మించి పూర్తి చేశారు. ఇందులో ఎక్క‌డా కూడా ప్లాస్టిక్ వాడ‌లేద‌ట‌. పీఓపీ, ఇతర మెటీరియల్ ఉపయోగించి ఆక‌ర్షిణీయంగా సెట్‌ని తీర్చిదిద్దారు. ఇంటి ఫినిషింగ్ కోస‌మే 60 రోజుల ప‌ట్టింద‌ట‌. ప‌ర్యావ‌ర‌ణ హితం కోసం నిర్వాహ‌కులు సెట్ కోసం భారీ మొత్తాన్నే ఖ‌ర్చు పెట్టార‌ని అంటున్నారు. ఇంతకుముందు లోనావాలాలో సెట్ రూపొందించ‌గా, ఈ సారి హౌస్ సెట్‌ను ముంబైలోని ఫిల్మ్ సిటీలో తీర్చిదిద్దారు. మ్యూజియం థీమ్‌తో రూపొందిన తాజా సెట్ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. హౌస్‌లో మొత్తం 93 కెమెరాలను అమర్చారు. అలాగే మొత్తం 14 బెడ్‌లను ఏర్పాటు చేశారు. ఆర్ట్ డైరెక్టర్ ఓమంగ్ కుమార్ సెట్ మొత్తాన్ని అందంగా, ఆక‌ర్షిణీయంగా రూపొందించి అంద‌రి దృష్టి బిగ్ బాస్ హౌజ్‌పై ఉండేలా ప్లాన్ చేశారు.
6400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles