సూప‌ర్ 30 టీంతో క‌లిసి సినిమా వీక్షించిన వెంక‌య్య నాయుడు

Thu,July 18, 2019 12:23 PM
Vice President Venkaiah Naidu watches Super 30

భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ఖాళీ స‌మ‌యాల‌లో మంచి సినిమాల‌ని వీక్షిస్తార‌నే సంగ‌తి తెలిసిందే. ఆయ‌న తాజాగా సూప‌ర్ 30 చిత్రాన్ని ఉప రాష్ట్రపతి భవన్‌లో ప్ర‌త్యేక స్క్రీనింగ్ వేయించుకొని చూశారు. ఆ స‌మ‌యంలో వెంక‌య్య నాయుడుతో పాటు చిత్ర బృందం అంతా ఉన్నారు. సూప‌ర్ 30 చిత్రం త‌న మ‌న‌సుని క‌దిలించ‌ద‌ని తెలిపారు వెంక‌య్య‌. అవాంత‌రాలన్నింటిని అధిగ‌మించి పేద పిల్లల‌కి బంగారు భ‌విష్య‌త్ అందించాల‌నే ఆనంద్ స్పూర్తి న‌న్ను ఎంత‌గానో క‌దిలించింది. వంద‌లాది పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం క‌ల‌లు క‌న్న ఉపాధ్యాయుడి జీవితాన్ని తెర‌పైకి తీసుకొచ్చిన నిర్మాత‌ల‌కి శుభాకాంక్ష‌లు. హృతిక్‌తో పాటు ప‌లువురు న‌టీన‌టుల న‌ట‌న కూడా నన్ను ఆక‌ట్టుకుంది. సూప‌ర్ 30 పేరిట కోచింగ్ సెంట‌ర్‌ని ప్రారంభించిన ఆనంద్‌ని కూడా అభినందిస్తున్నాను అంటూ వెంక‌య్య నాడు త‌న ట్విట్ట‌ర్ ద్వార తెలిపారు. అలానే చిత్ర బృందంతో క‌లిసి దిగిన ఫోటోలు కూడా షేర్ చేశారు. ప్రముఖ గణిత ప్రొఫెస‌ర్‌ ఆనంద్‌ కుమార్ జీవిత నేప‌థ్యంలో సూప‌ర్ 30 చిత్రం తెర‌కెక్క‌గా ఈ చిత్రానికి వికాస్ బెహెల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నడియాద్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌, టీవీ నటుడు నందిష్‌ సింగ్‌ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు1215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles