కాస్టింగ్ కౌచ్ విష‌యంలో త‌న‌కి ఎదురైన అనుభ‌వాన్ని వివ‌రించిన విద్యా

Tue,August 27, 2019 01:22 PM
Vidya Balan shares her casting couch experience

కొద్ది రోజుల క్రితం కాస్టింగ్ కౌచ్ ఇండ‌స్ట్రీలో ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. కొంద‌రు న‌టీమ‌ణులు త‌మ‌కి జ‌రిగిన అవాంచ‌నీయ ఘ‌ట‌న‌ల‌ని వివరిస్తూ అల‌జ‌డులు రేపారు. తాజాగా బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్ కాస్టింగ్ కౌచ్ విష‌యంలో త‌న‌కి ఎదురైన అనుభ‌వాలు వివ‌రించింది. పింక్ విల్లాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుడు త‌న‌ని గ‌దికి వెళ‌దామ‌ని ప‌ట్టుబ‌ట్టిన‌ట్టు చెప్పుకొచ్చింది.

2005లో ప‌రిణీత చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విద్యాబాల‌న్ మాట్లాడుతూ.. నేను ఒక‌రోజు చెన్నైలో ఉన్న‌ట్టు గుర్తుంది. ద‌ర్శ‌కుడు న‌న్ను కల‌వ‌డానికి వ‌చ్చాడు. కాఫీ షాపులో కూర్చుందాం అని నేను అన్నాను. మీతో మాట్లాడాలి, గ‌దికి వెళదాం అని ద‌ర్శ‌కుడు ప‌ట్టుబ‌ట్టాడు. ఆ స‌మ‌యంలో నా రూము గ‌ది డోర్ ఓపెన్ చేసి ఉంచ‌డంతో, ఆయ‌న ఐదు నిమిషాల‌లో వెళ్లిపోయాడు. ఈ విష‌యం గురించి మాట్లాడుతున్న స‌మ‌యంలో నా మ‌న‌స్సు ఒక్క‌సారిగా గ‌తంలోకి జారుకుంది.

అప్ప‌ట్లో నా గురించి ఎవ‌రో రాశారు. ఆమె దుస్తులు ఇలానే వేసుకుంటుంది. బ‌య‌ట‌కి రాదు. ఇన్‌డోర్స్‌లోనే ఎక్కువ‌గా ఉంటుంది అని. అది అప్ప‌ట్లో న‌న్ను ఎంత‌గానో ప్ర‌భావితం చేసిందని పత్రిక‌కి చెప్పుకొచ్చింది విద్యా. ఇటీవ‌ల విద్యా న‌టించిన మిష‌న్ మంగ‌ళ్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

2076
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles