షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ కుర్ర‌ హీరో

Sat,February 10, 2018 09:06 AM
Vidyut Gets Injured On The Sets

ఈ మ‌ధ్య కాలంలో కొంద‌రు హీరోలు డూప్స్‌, రోప్స్ లాంటివి లేకుండా స్టంట్స్ చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నారు. రిస్క్ అని తెలిసి కూడా అభిమానులని అల‌రించేందుకు వారు చేస్తున్న స్టంట్స్ అందరిని అబ్బుర‌ప‌రుస్తున్నాయి. తాజాగా విద్యుత్ జ‌మాల్ త‌న తాజా చిత్రం జంగిల్ కోసం అడ్వెంచ‌ర్స్ చేశాడు. మార్ష‌ల్ ఆర్ట్స్‌తో పాటు క‌లారిప‌య‌ట్టులో శిక్ష‌ణ పొందిన విద్యుత్, సినిమా కోసం ఎత్తులో ఉన్న విండో నుండి దూకాల‌ని ప్ర‌య‌త్నించాడు. ఈ క్ర‌మంలో అత‌ని త‌ల‌కి క్రేన్ బ్రిడ్జి త‌గిలింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన యూనిట్ విద్యుత్ జ‌మాల్‌కి మెడిక‌ల్ ట్రీట్‌మెంట్ అందించారు. కొద్ది సేప‌టి త‌ర్వాత మ‌ళ్ళీ షూటింగ్ ప్రారంభించింది చిత్ర యూనిట్‌.


1729
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles