విజ‌య్ ఆంటోని 'కొలైకార‌న్' చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల‌

Thu,April 25, 2019 08:06 AM
Vijay Antony Kolaigaran trailer released

బిచ్చ‌గాడు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన హీరో విజ‌య్ ఆంటోని. జెట్ స్పీడ్‌తో వ‌రుస సినిమాలు చేసుకుంటూ వెళ్ళే విజ‌య్ ఆంటోని బిచ్చ‌గాడు త‌ర్వాత అలాంటి విజ‌యం సాధించ‌లేక‌పోయాడు. అయిన‌ప్ప‌టికి ఓటమికి వెనుక‌డుగు వేయ‌కుండా వ‌రుస సినిమాల‌తో దూసుకెళుతున్నాడు. బిచ్చగాడు తర్వాత బేతాళుడు,యమన్, ఇంద్రసేన అనే చిత్రాలతో విజయ్ ఆంటోని ప్రేక్షకుల ముందుకు రాగా, ఇవి అభిమానులని అంతగా అలరించలేకపోయాయి. ప్ర‌స్తుతం కొలైకార‌న్ అనే టైటిల్‌తో తెరకెక్క‌నున్న చిత్రంలో న‌టిస్తున్నాడు. ఆండ్రూ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొంద‌నుంది. దియా మూవీస్‌ బ్యానరులోని ఈ సినిమాలో అర్జున్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆషిమా నర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. నాజర్‌, సీత, వీటీవీ గణేశ్‌లు నటిస్తున్నారు. ఇందులో విజ‌య్ ఆంటోని నెగెటివ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు టాక్‌. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న థ్రిల్ల‌ర్ మూవీగా తెలుస్తుంది. పోలీస్ ఆఫీస‌ర్‌గా అర్జున్ న‌టిస్తుండ‌గా, విజ‌య్ ఆంటోని పాత్ర కాస్త భిన్నంగా ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. ఆండ్రూ అయిస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైల‌ర్ రీసెంట్‌గా విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. మీరు ట్రైల‌ర్‌పై ఓ లుక్కేయండి.

1134
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles