పెళ్ళి వార్త‌ల‌ని కొట్టి పారేసిన హీరో

Sun,June 4, 2017 04:14 PM
VIJAY clash the rumours on him

పెళ్ళి చూపులు సినిమాతో అంద‌రి అటెన్ష‌న్ త‌న వైపుకు తిప్పుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన విజ‌య్ ప్ర‌స్తుతం అర్జున్ రెడ్డి చిత్రంతో ప‌ల‌క‌రించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ బేన‌ర్ పై ఓ సినిమా చేయ‌నున్న విజ‌య్ .. నందిని రెడ్డితోను చిత్రం చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే ఇటీవ‌ల ఈ కుర్ర హీరో విమ్మి అనే అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకోనున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌లు విజ‌య్ చెవిన కూడా ప‌డ‌డంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా దీనిపై స్పందించాడు. 14 గంట‌లు ఫ్లైట్ లో ఉంటే ఇండియాలో నా పెళ్లి చేస్తున్నారటా.. మ‌రొక విష‌యం మ‌ర‌చిపోయారు . నా ఇద్ద‌రు పిల్ల‌ల పేర్లు రుమ్మి, డుమ్మి, వీరి పేర్ల‌ను వారి మ‌మ్మి విమ్మితో పాటు మెన్ష‌న్ చేయ‌డం మ‌ర‌చిపోయారు. మీ విషెస్ కి నా ధ‌న్య‌వాదాలు అంటూ విజ‌య్ ఓ ప‌న్నీ పోస్ట్ ఫేస్ బుక్ లో పెట్టాడు. విజ‌య్ ప్ర‌స్తుతం షూటింగ్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన‌ట్టు స‌మాచారం.

3032
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles