విజ‌య్ దేవ‌ర‌కొండ త‌దుప‌రి ప్రాజెక్ట్‌పై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న‌

Wed,March 13, 2019 08:12 AM
Vijay Devarakonda new project announced

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ చిత్రంతో పాటు క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజ‌య్. ఈ రెండు చిత్రాలు 2019లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఇక తాజాగా మ‌రో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఈ చిత్రం మైత్రి మూవీ మేక‌ర్స్ బేన‌ర్‌లో రూపొంద‌నుండ‌గా సౌత్‌లోని అన్ని భాష‌ల‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. ఆనంద్ అన్నామ‌లై ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి హీరో అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 22 నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. న్యూ ఢిల్లీలో తొలి షెడ్యూల్ జ‌ర‌పనున్నారు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు మ‌రి కొద్ది రోజుల‌లో వెల్లడించ‌నున్నార‌ట‌. అర్జున్ రెడ్డి సినిమాతో అన్ని భాష‌ల‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ బైలింగ్యువ‌ల్ ప్రాజెక్ట్‌తో అంత‌టా మంచి ప‌ట్టు బిగించాల‌ని చూస్తున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.1857
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles