పెళ్ళి పీట‌లెక్క‌నున్న పెళ్ళి చూపులు హీరో..!

Fri,June 2, 2017 12:40 PM
Vijay Devarakonda ready to maary

పెళ్ళి చూపులు సినిమాతో అంద‌రి అటెన్ష‌న్ త‌న వైపుకు తిప్పుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన విజ‌య్ ప్ర‌స్తుతం అర్జున్ రెడ్డి చిత్రంతో ప‌ల‌క‌రించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ బేన‌ర్ పై ఓ సినిమా చేయ‌నున్న విజ‌య్ .. నందిని రెడ్డితోను చిత్రం చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే ఇప్పుడిప్పుడే కెరియ‌ర్ మంచి గాడిలో ప‌డుతుంద‌నుకుంటున్న స‌మ‌యంలో ఈ కుర్ర హీరోకి సంబంధించిన ఓ వార్త అంద‌రిని షాక్ కి గురి చేస్తుంది. విజ‌య్ గ‌త కొంత కాలంగా విమ్మి అనే మ‌హిళ తో ప్రేమ‌లో ఉన్నాడ‌ని, త్వ‌ర‌లోనే పెళ్ళి కూడా చేసుకోబోతున్నాడ‌నే విష‌యాన్ని ఓ ఇంగ్లీష్ ప‌త్రిక ప్ర‌చురించింది. విజ‌య్ తాను చేస్తున్న ప్రాజెక్టులు పూర్తైన త‌ర్వాతే వివాహం చేసుకోనున్నాడ‌ని టాక్. మ‌రి ఈ విష‌యంలో ఎంత నిజ‌ముందో తెలియ‌దు కాని , కెరీర్ ఊపందుకుంటున్న స‌మ‌యంలో విజ‌య్ తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌ది కాదు అంటూ కొంద‌రు స‌ల‌హాలిస్తున్నారు.

2230
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles