ఒక్క హిట్ తో వరుస ఆఫర్లు

Thu,December 29, 2016 10:36 AM

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందనే విషయం తెలిసిందే. కాని ఒక్క హిట్‌ తో కూడా జీవితం మారుతుందనే విషయాన్ని పెళ్లి చూపులు ఫేం విజయ్ దేవరకొండ నిరూపించాడు. పెళ్ళి చూపులు సక్సెస్ తర్వాత ఈ హీరో వరుసగా ఆరు చిత్రాలకు కమిట్ అయ్యాడట. ఆచితూచి కథలను ఎంచుకుంటున్న విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా చేసేందుకు కమిటయ్యాడు. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాలు తెరకెక్కించిన క్రాంతి మాధవ్ ప్రస్తుతం సునీల్ తో ఉంగరాల రాంబాబు అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత తాను విజయ్ దేవరకొండ సినిమాను పట్టాలెక్కించనున్నట్టు తెలిపాడు. ఏదేమైన పెళ్ళి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ ఇలా వరుస ఆఫర్లను అందుకోవడం విశేషమే.

2862
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles