పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ.. ప్రకటించిన చార్మి..

Mon,August 12, 2019 04:21 PM
vijay devarakonda to act in puri jagannadhs film

అర్జున్ రెడ్డి చిత్రంతో కేవలం తెలుగులోనే కాక దాదాపుగా అన్ని భాషల్లోనూ విజయ్ దేవరకొండ మంచి క్రేజ్‌ను సంపాదించాడు. ఇక విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ ఈ మధ్యే విడుదల కాగా ఈ చిత్రం 4 దక్షిణాది భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా విజయ్ దేవరకొండ త్వరలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మేరకు నటి చార్మి కొంత సేపటి క్రితమే తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఈ మూవీపై మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని చార్మి ట్వీట్ చేసింది. ఇక ఈ మూవీలో విజయ్ ఓ వైవిధ్యభరితమైన పాత్ర పోషించనున్నాడని తెలిసింది.

2649
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles