త‌మ్ముడి సినిమాని మెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ

Sat,July 13, 2019 12:51 PM
Vijay Deverakonda reviews brother Anands Dorasani

అతి తక్కువ స‌మ‌యంలోనే టాప్ హీరోగా ఎదిగిన యూత్ సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. త్వ‌ర‌లో ఆయ‌న డియ‌ర్ కామ్రేడ్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇక నిన్న విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ న‌టించిన దొర‌సాని చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రంలో శివాత్మిక క‌థానాయిక‌గా న‌టించింది. ఈ చిత్రంకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. రాజుగా ఆనంద్‌, దొర‌సానిగా శివాత్మిక అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రచార‌ని అంటున్నారు. అయితే ఈ చిత్ర స‌క్సెస్‌పై విజ‌య్ దేవ‌రకొండ త‌న ట్విట్ట‌ర్ ద్వార స్పందించాడు. యువ న‌టీన‌టుల‌ని చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను. మై బాయ్.. ఐల‌వ్యూ సో మ‌చ్. నీ కంటే రాజునే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నాను. శివాత్మిక నీ న‌ట‌న అద్భుతం. ప్ర‌తి ఒక్క‌రు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చారు. ఈ కారంగా సినిమా చూడ‌టానికి అద్భుతంగా ఉంది. కె.వి.ఆర్.మహేంద్ర, ప్రశాంత్ విహారి, సన్నీ కూరపాటి మీరు నిజంగా సూపర్. త్వరలోనే మన దారులు కలుస్తాయని అనుకుంటున్నారు. సినీ లవర్స్ ని ఈ సినిమా మెప్పిస్తుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్'' అంటూత‌న ట్వీట్‌లో తెలిపాడు విజ‌య్.1274
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles