గమనిక: సన్ రైజర్స్ కోసం నాని ఆడొచ్చు : విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Mon,April 22, 2019 08:08 AM
vijay deverakonda surprise tweet on nani

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన జెర్సీ చిత్రంపై ప్ర‌శంస‌ల వర్షం కురుస్తూనే ఉంది. ముఖ్యంగా తొలిసారి క్రికెట‌ర్ పాత్ర‌లో న‌టించిన నాని ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని దోచేశాడు. ఇప్ప‌టికే నానిపై జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నిఖిల్, మంచు మనోజ్ లాంటి సెలబ్రిటీలు ప్ర‌శంస‌లు కురిపిస్తే తాజాగా యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఏకంగా నానిని స‌న్‌రైజ‌ర్స్‌కి ఆడించొచ్చు అనే కామెంట్ చేశాడు. జెర్సీ చిత్రం వీక్షించిన విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా జెర్సీ ప్రేమ‌లో అర్జున్ న‌న్ను ఉక్కిరి బిక్కిరి చేశాడు. క్లాప్స్ కొట్టించాడు. అర్జున్ పాత్ర‌లో లీన‌మ‌య్యేలా చేశాడు. నానిపై నాకు ఎంతో ప్రేమ క‌లిగింది. గౌత‌మ్ నీలో దాగి ఉన్న మ‌రింత‌ టాలెంట్ చూడాల‌ని అనుకుంటున్నాను. గ‌మ‌నిక : సన్ రైజర్స్ హైదరాబాద్ కోసం నాని ఆడొచ్చు. అద్భుతంగా ఆడాడు’’ అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ట్వీట్‌లో తెలిపాడు. జెర్సీ చిత్రం పి.డి.వి.ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కింది. సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ చిత్రంలో శ్ర‌ద్ధా శ్రీనాథ్ క‌థానాయిక‌గా న‌టించింది.3523
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles