మెగా హీరో మూవీలో త‌మిళ స్టార్ హీరో న‌టిస్తున్న వార్త నిజ‌మే..!

Sun,March 17, 2019 07:59 AM

త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్ సేతుప‌తి ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రిస్తున్నాడు. ఒక‌వైపు హీరోగా న‌టిస్తూనే మ‌రోవైపు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్‌లో మెరుస్తున్నాడు. ఈ మ‌ధ్య 96 అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచాడు. ఇక‌ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న సైరా చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం కానున్నాడు విజ‌య్ సేతుప‌తి. అయితే ఇప్పుడు సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ డెబ్యూ మూవీలోను విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.


సైరా సినిమాలో న‌టిస్తున్న విజ‌య్ సేతుప‌తిని చిరు త‌న మేన‌ల్లుడి సినిమాలోను న‌టించ‌మ‌ని కోరాడట‌. చిరు కోరిన వెంట‌నే తాను వైష్ణ‌వ్ తేజ్ సినిమాలో న‌టించేందుకు ఓకే చెప్పాడ‌ని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలు నిజమేనని సమాచారం వస్తుంది. విల‌న్ పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తిని చూపించాల‌ని ద‌ర్శ‌కుడు భావిస్తున్నాడ‌ట‌. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు డైరెక్షన్‌లో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

2935
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles