సైరాలో విజ‌య్ సేతుప‌తి పాత్ర‌పై వ‌చ్చిన క్లారిటీ

Tue,July 31, 2018 10:22 AM

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా..నరసింహరెడ్డి భారీ బడ్జెట్ తో నేషనల్ రేంజ్ లో తెరకెక్కుతున్న‌ సంగతి తెలిసిందే. సౌత్, నార్త్ ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ స్టార్స్ ఈ ప్రాజెక్ట్ లో నటిస్తుండగా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తొలిసారి చిరు మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న విజయ్ సేతుపతి సైరా చిత్రంలో పవర్ ఫుల్ పాత్ర చేయనున్నాడట. త‌మిళ్ మాట్లాడే ఓ యోధుడి పాత్ర‌లో విజ‌య్ క‌నిపించ‌నున్నాడు. బ్రిటీష్ వారిని వ‌ణికించిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి .. త‌మిళులు, తెలుగు వారిని ఒకే తాటిపై తెచ్చేందుకు చాలా కృషి చేశారని, ఈ నేప‌థ్యంలో త‌మిళ‌, తెలుగు భాష‌ల ప్ర‌జ‌ల‌ని క‌లిపి మాట్లాడే క్యారెక్ట‌ర్ తాను పోషించిన‌ట్టు విజ‌య్ సేతుప‌తి తెలిపారు. త్వ‌ర‌లోనే తాను టీంతో క‌ల‌వ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.


ఇక చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల విడుద‌లైన ఫోటోలు అభిమానుల రోమాలు నిక్క పొడుచుకునేలా చేశాయి. భారీగా ఉన్న కోట ద్వారం, బ్రిటీష్ సైన్యాన్ని బ‌ట్టి న‌ర‌సింహ‌రెడ్డి త‌న బృందంతో బ్రిటీష్ సైన్యంపై దాడి చేసే ఉదంతానికి సంబంధించిన బారీ స‌న్నివేశం అని తెలిసింది. త్వ‌ర‌లో మూవీ టీం మ‌రో షెడ్యూల్ కోసం యూర‌ప్‌కి వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం. అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు , సుదీప్‌, న‌య‌న‌తార ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. మూవీని స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. చిత్రానికి బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించ‌నున్నాడ‌ని టాక్‌. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బేన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ సైరా చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా యాక్షన్‌ సీన్స్ కోసం స్కైఫాల్‌, హ్యారీ పొట‌ర్‌ల‌కి ప‌ని చేసిన హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్లు ప‌ని చేస్తున్నారు.

1727
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles