మ‌రోసారి డైలాగ్స్ రాస్తున్న స్టార్ హీరో

Sat,May 25, 2019 01:47 PM
Vijay Sethupathi Turns A Dialogue Writer Once Again

కోలీవుడ్‌లో అత్యంత బిజీ హీరోస్‌లో విజ‌య్ సేతుప‌తి ఒకరు. తెలుగులో సైరా చిత్రంతో పాటు వైష్ణ‌వ్ తేజ్ సినిమా చేస్తున్న విజ‌య్ సేతుప‌తి త‌మిళంలో తొమ్మిదికి పైగా ప్రాజెక్టులు చేస్తున్నాడు. రీసెంట్‌గా 96, సూప‌ర్ డీల‌క్స్ అనే చిత్రాల‌తో మంచి విజ‌యాలు సాధించిన విజ‌య్ డైలాగ్ రైట‌ర్‌గా మారాడ‌ట‌. గ‌తంలో ఆరెంజ్ మిట్టాయి అనే చిత్రానికి విజ‌య్ సేతుప‌తి డైలాగ్స్ అందించ‌గా, ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డింది. అయిన‌ప్ప‌టికి మ‌రోసారి డైలాగ్స్ అందించేందుకు ఈ త‌మిళ హీరో ముందుకొచ్చాడు.

స్పేస్ అడ్వెంచ‌ర్ చిత్రంగా తెర‌కెక్క‌నున్న చెన్నై ప‌ల‌ని మార్స్ అనే చిత్రానికి విజ‌య్ సేతుప‌తి డైలాగ్స్ అందిస్తున్నారు. కొత్త న‌టీనటులు ఇందులో భాగం కానున్నార‌ని తెలుస్తుండ‌గా, ఈ చిత్రాన్ని రూర‌ల్ బ్లాక్ కామెడీ మూవీగా రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఆరెంజ్ మిట్టై ద‌ర్శ‌కుడు బిజు విశ్వ‌నాథ్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ సారి విజ‌య్ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ రాస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తుండ‌గా, డైలాగ్ రైటర్‌గా కూడా విజ‌య్ త‌న స‌త్తా చాటుకోనున్నాడ‌ని అంటున్నారు .

2911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles