మ‌హాప్ర‌స్థానంలో రేపు విజ‌య నిర్మ‌ల అంత్య‌క్రియ‌లు

Thu,June 27, 2019 08:15 AM
Vijaya nirmala crimisssion on 28 june

గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించిన తొలి మ‌హిళా ద‌ర్శ‌కురాలు విజ‌య నిర్మల హైద‌రాబాద్‌ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న‌ కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధ‌వారం అర్ధ‌రాత్రి క‌న్నుమూశారు. ఆమె మ‌ర‌ణంతో టాలీవుడ్ శోక‌సంద్రంలో మునిగింది. సినీ ప‌రిశ్ర‌మ‌కి చెందిన ప్ర‌ముఖులు ఆమెకి నివాళులు అర్పించారు. విజ‌య నిర్మల ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప్రార్ధించారు. ఈ రోజు ఉద‌యం 10 గం.ల‌కి విజ‌య నిర్మల పార్ధివ‌దేహాన్ని నానక్‌రామ్ గూడలోని ఆమె ఇంటికి త‌ర‌లించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అభిమానుల సంద‌ర్శ‌నార్దం త‌ర్వాత రేపు ఉదయం ఫిల్మ్‌ ఛాంబర్‌కు తీసుకువస్తారు. శుక్రవారం మ‌హా ప్ర‌స్థానంలో విజయ నిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి.2480
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles