మ‌హేష్ సినిమాలో న‌టిస్తున్న‌ట్టు క‌న్‌ఫాం చేసిన విజ‌య శాంతి

Sat,June 1, 2019 07:07 AM
Vijaya Shanthi Says She Is Happy To Make Her Comeback

మ‌హేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ మే 31న లాంచ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్టు ఎప్ప‌టి నుండో వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై విజ‌య్ శాంతి పత్రికా ప్ర‌క‌ట‌న ద్వారా త‌న అభిమానుల‌కి క్లారిటీ ఇచ్చింది. తెలుగులో కృష్ణ‌తో క‌లిసి తొలి సినిమా చేసిన తాను మ‌ళ్ళీ రీ ఎంట్రీలో ఆయ‌న త‌న‌యుడు మ‌హేష్ చిత్రంలో న‌టించ‌డం ఆనందంగా ఉంద‌ని పేర్కొంది.

తెలుగులో నేను కృష్ణ స‌ర‌స‌న ఖిలాడీ అనే సినిమా చేశాను. ఇది తెలుగులో నా తొలి చిత్రం. ఈ మూవీ త‌ర్వాత 150 సినిమాలు చేశాను. రాజ‌కీయాల‌లోకి వెళ్ళాక సినిమాల‌కి దూరంగా ఉండాల్సి వ‌చ్చింది. దాదాపు 13 ఏళ్ళ త‌ర్వాత మ‌ళ్ళీ కెమెరా ముందుకు వ‌స్తున్నాను. తొలి సినిమా కృష్ణ‌తో న‌టిస్తే రీ ఎంట్రీ చిత్రం ఆయ‌న త‌న‌యుడితో చేయ‌డం ఆనందంగా ఉందని విజ‌య‌శాంతి పేర్కొన్నారు. అనిల్‌ సుంకర, దిల్‌ రాజు, మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందాన్న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

2759
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles