ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ నుండి మెలోడి సాంగ్ విడుద‌ల‌

Wed,March 20, 2019 11:05 AM

రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. మార్చి 29న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారంటూ వ‌ర్మ ఇటీవ‌ల త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. అయితే కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించి ప‌లు వీడియో సాంగ్స్ విడుద‌ల చేస్తున్న వ‌ర్మ తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా విజ‌యం అనే వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. క‌ళ్యాణ్ మాలిక్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మెలోడీ సాంగ్‌ని సిరాశ్రీ రాసారు. ఎస్పీ బాల సుబ్ర‌హ్మాణ్యం, మోహ‌న్ భోగ‌రాజు క‌లిసి ఈ పాట‌ని ఆల‌పించారు. ఈ సాంగ్ అభిమానుల‌ని అల‌రిస్తుంది. మీరు ఈ వీడియో సాంగ్‌పై ఓ లుక్కేయండి.


తెలుగు రాష్ట్రాల‌ ఎన్నికల నేపథ్యంలో..ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిలిపేయాలని కోరుతూ సత్యనారాయణ అనే వ్యక్తి ఇటీవ‌ల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సత్యనారాయణ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు..రెండు సినిమాల విడుదల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన విష‌యం తెలిసిందే.

1507
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles