మ‌హేష్ సెట్‌లో అడుగుపెట్ట‌నున్న రాముల‌మ్మ‌

Tue,August 6, 2019 08:42 AM
vijayashanthi ready to enter  into Sarileru Neekevvaru set

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో స‌రిలేరు నీకెవ్వ‌రు అనే క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ రీసెంట్‌గా మొద‌లు పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఈ షూటింగ్ లో బండ్ల గణేశ్ ఇప్ప‌టికే జాయిన్ అయ్యారు. చాలా ఏళ్ళ త‌ర్వాత మ‌ళ్ళీ ఈ సినిమాతో ఆయ‌న రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక పదమూడేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ స్క్రీన్‌ మీద కనిపించేందుకు సిద్ద‌మైంది విజయశాంతి.

స‌రలేరు నీకెవ్వ‌రు చిత్రం కోసం విజ‌య‌శాంతి సుమారు 55 రోజులు డేట్స్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఆగ‌స్ట్ 9న ఆమె సెట్‌లోకి అడుగుపెట్టనున్న‌ట్టు తెలుస్తుంది. విజ‌య‌శాంతి చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఆమెకి సంబంధించిన స‌న్నివేశాల‌పై ద‌ర్శ‌కుడు స్పెష‌ల్ ఎంట్రెస్ట్ పెట్టిన‌ట్టు టాక్. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంలో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

1825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles