స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో విజ‌య‌శాంతి పాత్ర ఏంటో తెలుసా?

Sun,August 18, 2019 10:37 AM
Vijayashanthis role in Sarileru Neekevvaru revealed

90లలో లేడీ సూపర్‌స్టార్‌గా అద్భుతమైన స్టార్‌డమ్‌ సంపాదించిన విజ‌య‌శాంతి మ‌ళ్ళీ 13 ఏళ్ళ త‌ర్వాత స‌రిలేరు నీకెవ్వ‌రు అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్‌లో జాయిన్ అయిన విజ‌య‌శాంతి చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ట‌. ఈ సినిమా కోసం 55 రోజులు డేట్స్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. విజ‌య‌శాంతి పాత్ర‌కి సంబంధించిన కొద్ది రోజులుగా ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో విజ‌య‌శాంతి మెడిక‌ల్ ప్రొఫెస‌ర్ పాత్ర‌లో కనిపించ‌నుంద‌ని చెబుతున్నారు. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో స‌రిలేరు నీకెవ్వ‌రు అనే క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేష్ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఆయ‌న స‌ర‌స‌న‌ ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

2339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles