జైరా వసీం కేసులో నిందితుడికి బెయిల్..

Wed,December 20, 2017 05:30 PM
Vikas Sachdeva granted bail in  Zaira Wasim molestation case


ముంబై ; బాలీవుడ్ నటి, దంగల్ ఫేం జైరావసీంపై వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో నిందితుడు వికాస్ సచ్‌దేవకు డిందోసి సెషన్స్ కోర్టు రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త వికాస్ సచ్‌దేవ జైరావసీం పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో.. అతన్ని ఈ నెల 10న అరెస్ట్ చేసి డిసెంబర్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. కాగా జైరా వసీం ఘటనపై దేశవ్యాప్తంగా రాజకీయవేత్తలు, సినీ నటులు, మహిళా సంఘాలు పెద్ద ఆందోళన వ్యక్తం చేశాయి.

1357
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles