నాని త‌ర్వాత నాగార్జున‌తో క్రేజీ ప్రాజెక్ట్‌

Wed,June 26, 2019 10:03 AM

ఈ త‌రం ద‌ర్శ‌కులు వినూత్న క‌థ‌ల‌తో వ‌రుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా విక్ర‌మ్ కుమార్ నానితో సినిమా చేస్తూనే త‌న త‌ర్వాతి ప్రాజెక్ట్‌కి రంగం సిద్దం చేసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. విక్ర‌మ్ ప్ర‌స్తుతం నాని ప్ర‌ధాన పాత్ర‌లో గ్యాంగ్ లీడ‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందించ‌డం ఖాయం అని ఆయ‌న చెబుతున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న విక్ర‌మ్ రీసెంట్‌గా నాగార్జున‌ని క‌లిసి మంచి కాన్సెప్ట్ చెప్పార‌ట‌. దానికి ఇంప్రెస్ అయిన ఆ ప్రాజెక్ట్ త‌ప్ప‌క చేద్దామ‌ని అన్నార‌ట‌. గ‌తంలో విక్ర‌మ్ కుమార్ నాగ్ ఫ్యామిలీకి మ‌నం రూపంలో అమూల్య‌మైన గిఫ్ట్ అందించిన విష‌యం విదిత‌మే. మ‌రి నాగ్ ప్ర‌స్తుతం మ‌న్మ‌థుడు 2 చిత్రంతో బిజీగా ఉండగా, ఆ త‌ర్వాత సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి ప్రీక్వెల్‌గా బంగార్రాజు చేయ‌నున్నాడు. మ‌రో వైపు బిగ్ బాస్ సీజ‌న్ 3తోను బిజీగా ఉండ‌నున్నాడు. ఈ నేప‌థ్యంలో విక్ర‌మ్ కుమార్- నాగ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుంతో చూడాలి.

854
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles