అచ్చొచ్చిన వేదిక‌నే ఎంచుకున్న రామ్ చ‌ర‌ణ్‌

Tue,December 25, 2018 08:23 AM
vinaya Vidheya Rama pre release event date fixed

న‌టుడు, నిర్మాత‌గా ఫుల్ బిజీ అయిన రామ్ చ‌ర‌ణ్ .. బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో విన‌య విధేయ రామ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి ప‌లు సాంగ్స్ విడుద‌ల చేసిన చిత్ర బృందం ఈ నెల 27న యూస‌ఫ్‌గూడ‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిపేందుకు స‌న్నాహాలు చేస్తుంది. ఇదే స్థ‌లంలో గ‌త సినిమాల‌కి సంబంధించిన ఆడియో ఫంక్ష‌న్స్‌, విజ‌యోత్స‌వ వేడుక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఇషా గుప్తా స్పెష‌ల్ సాంగ్‌తో అల‌రించనుంది. దేవి శ్రీ ప్ర‌సాద్ చిత్రానికి సంగీతం అందించారు. స్నేహా, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, అనన్య, ఆర్యన్‌ రాజేష్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. యాక్షన్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నట్టు తెలుస్తుంది.రామ్ చ‌ర‌ణ్ .. రాజ‌మౌళి క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్‌లోను న‌టిస్తున్న విష‌యం విధిత‌మే. 2020 స‌మ్మ‌ర్‌లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.

1923
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles