అదుర్స్ పై మనసు పారేసుకున్న వివి వినాయక్..!

Sat,September 16, 2017 03:00 PM
vinayak shows his interest on adurs sequel

బాలీవుడ్ లోనైనా, టాలీవుడ్ లో నైనా ఇప్పుడు మూడు రకాల ట్రెండ్స్ నడుస్తున్నాయి. ఒకటి బయోపిక్స్ చేయడం, రెండు ఒక భాషలో హిట్ అయిన లేదా బ్లాక్ బస్టర్ గా విజయం సాధించిన సినిమాను రీమేక్ చేయడం. మూడు గతంలో హిట్ అయిన సినిమాకు సీక్వెల్ తీయడం. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా ప్రస్తుతం అలాంటి ఓ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇటీవ‌ల చిరంజీవితో ఖైదీ నంబర్ 150 చిత్రాన్ని తీసి దీనిని బ్లాక్ బస్టర్ హిట్ చేశాడు వినాయక్. ఆ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న వినాయక్ మ‌ళ్ళీ మెగా హీరోతోనే ఓ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. సాయిధ‌ర‌మ్ - వివి వినాయ‌క్ కాంబినేషన్‌లో రూపొంద‌నున్నఆ చిత్రం లేటెస్ట్‌గా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. క‌ట్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన అదుర్స్ మూవీకి సీక్వెల్ ఒక‌టి చేయాల‌ని వినాయ‌క్ అనుకుంటున్నాడ‌ట‌. ఇప్ప‌టికే సీక్వెల్ కి తగిన కథను కోన వెంకట్ రెడీ చేస్తున్నాడ‌నే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రొటీన్ సబ్జెక్ట్స్ బదులు ఒకదానికొకటి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండే సబ్జెక్ట్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మ‌రి ఆ రకంగా చూసినప్పుడు వివి వినాయక్ తో అదుర్స్ -2 చేయడానికి యంగ్ టైగర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనేది డౌట్ అంటున్నారు.

1974
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles