చెత్త కుప్ప‌లో ప‌డేసిన పాపని ద‌త్త‌త తీసుకున్న ద‌ర్శ‌కుడు

Sun,June 23, 2019 12:49 PM
Vinod Kapri abandoned girl

ప్ర‌తి రోజు మ‌నం వార్త‌ల‌లో ఎన్నో హృద‌య విదార‌క సంఘ‌ట‌న‌లు చూస్తున్నాం, వింటూ ఉన్నాం. అభం శుభం తెలియ‌ని చిన్నారుల‌ని చంపేయ‌డం లేదంటే వారిని చెత్త కుప్ప‌ల్లో ప‌డేసి చేతులు దులుపుకోవడం కొంద‌రు క‌ర్కశ‌మైన మ‌న‌స్త‌త్వం ఉన్న త‌ల్లులు చేస్తున్నారు. రీసెంట్‌గా రాజస్థాన్‌లోను ముక్కుప‌చ్చ‌లార‌ని ఓ ప‌సికందుని చెత్త కుప్ప‌లో ప‌డేసి చేతులు దులుపుకుంది ఓ త‌ల్లి. అయితే చిన్నారి గ‌ట్టిగా ఏడుస్తుండ‌డంతో అది గ‌మ‌నించిన స్థానికులు పాపని ఆసుప‌త్రికి తీసుకెళ్ళారు. పాప‌కి సంబంధించిన వీడియో ద‌ర్శ‌కుడు వినోద్ కాప్రి దృష్టికి రావ‌డంతో వెంట‌నే స‌ద‌రు ఆసుప‌త్రికి వెళ్ళి ఆ ప‌సికందుని తాను ద‌త్త‌త తీసుకుంటాన‌ని చెప్పాడు. అంతేకాదు తాను తెర‌కెక్కించిన చిత్ర టైటిల్ పీహూని ఆ పాప‌కి పేరుగా పెట్టారు.

ఆ త‌ర్వాత వినోద్ కాప్రి మీడియాతో మాట్లాడుతూ.. మనం ఏం చేయ‌లేం. ఆ లిటిల్ ఏంజెల్‌తో మేము ప్రేమ‌లో ప‌డ్డాం. ద‌త్తత తీసుకునే ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. ముందు ముందు చేయాల్సింది చాలా ఉంది. పాప ఇంటికి వ‌చ్చే వ‌ర‌కు నేను ఏమి మాట్లాడాల‌ని అనుకోవ‌డం లేదు అని వినోద్ అన్నారు. పాప ప్ర‌స్తుతం 1.6 కేజీల బ‌రువు ఉండ‌గా, ఆసుప‌త్రిలో చేరే స‌మ‌యానికి పాప‌ శ్వాస తీసుకోవ‌డానికి ఇబ్బంది ప‌డింద‌ట‌. ప్ర‌స్తుతం ఆ పాప ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉన్న‌ట్టు తెలుస్తుంది. వినోద్ ప్ర‌స్తుతం 155 హ‌వర్స్ అనే చిత్రం చేస్తున్నాడు. ఆయ‌న చివ‌రి చిత్రం పిహూ కాగా, ఇందులో రెండేళ్ళ పాప పేరు పిహూ. ఆమె త‌ల్లి చనిపోతే పిహూని ఓ గ‌ధిలో తాళం వేసి బంధిస్తారు. ఈ చిత్ర స్టోరీ లైన్ ప్ర‌తి త‌ల్లితండ్రుల‌ని క‌ట్టి పడేసింది.10348
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles