వ‌ర‌ల‌క్ష్మీ కామెంట్స్‌పై స్పందించిన విశాల్

Sun,June 16, 2019 12:46 PM

హీరో విశాల్‌తో గత కొంత కాలంగా స్నేహంగా ఉన్న వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇటీవ‌ల సోషల్‌ మీడియా వేదికగా ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలకుగాను ఓ లెటర్‌ను పోస్ట్‌ చేసిన ఆమె అందులో విశాల్‌ని ఘాటుగా విమర్శించడం తమిళ చిత్ర వర్గాల్లో సంచలనంగా మారింది. ‘నీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియో చూశా. ఇంతగా దిగజారుతావని అనుకోలేదు. నీ వ్యాఖ్యలు విని షాక్‌కు గురయ్యా.ఎంతో బాధపడ్డా. నీపై నాకున్న కాస్త గౌరవం కూడా పోయింది. నా తండ్రి (శరత్‌కుమార్‌) గతం గురించి, ఆయనపై వున్న భూ వివాదం గురించి ఆరోపణలు చేయడం విచారకరం. అది కోర్టు పరిధిలో వుంది. తుది తీర్పు ఇచ్చే వరకు ఎవరూ దోషులు కారు. దోషి అని తేలిన తరువాతే శిక్షపడుతుంది. నువ్వు కాస్త హుందాగా ప్రవర్తించు. ఇలాంటి నీచమైన వీడియోలు నీ దిగజారుడు స్వభావాన్ని తెలుపుతున్నాయి అని ఘాటు కామెంట్స్ చేసింది వ‌ర‌ల‌క్ష్మీ.


ఇకనైనా రుషిలా నటించొద్దు . నువ్వు ఇప్పటి వరకు గొప్ప పనులు, గర్వంగా చెప్పుకునే పనులు చేసుంటే వాటిని ప్రజలకు వివరించు. ప్రచారంలో వాటి గురించి ప్రధానంగా మాట్లాడు. అంతే కానీ మా నాన్నని అవమానిస్తూ వ్యాఖ్యలు చేయకు. ఇన్నాళ్లు నేను నిన్ను గౌరవించాను. ఓ స్నేహితుడిలా భావించాను. నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా వున్నాను. కానీ ఇప్పుడు నువ్వు హద్దులు దాటి ప్రవర్తించావు. నా ఓటును కూడా నువ్వు కోల్పోయావు అంటూ వ‌ర‌ల‌క్ష్మీ నిప్పులు చెరిగింది. ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా స్పందించిన విశాల్‌.. అవి ఆమె వ్య‌క్తిగతం. త‌న‌కు మాట్లాడే స్వేచ్చ ఉందంటూ సింపుల్‌గా తేల్చేశాడు. నడిగర్‌ సంఘం ఎన్నిక‌లు ఈ నెల 23న జ‌ర‌గ‌నుండ‌గా, ఈ ఎన్నికల్లో విశాల్‌ పాండవార్ ప్యానెల్‌ తో పాటు కే భాగ్యరాజ స్వామి, శంకర్‌ దాస్‌ ప్యానెల్‌లు కూడా పోటీకి దిగుతున్న సంగ‌తి తెలిసిందే.

4812
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles