పెళ్ళి చూపులు రీమేక్ లో విశాల్,తమన్నా

Sat,March 25, 2017 11:14 AM

తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం పెళ్ళి చూపులు. డి.సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కందుకూరి(ధ‌ర్మ ప‌థ క్రియేష‌న్స్‌), య‌ష్ రంగినేని(బిగ్ బెన్ సినిమాస్‌) నిర్మించిన ఈ చిత్రాన్ని త‌రుణ్ భాస్క‌ర్ తెరకెక్కించారు. విజ‌య్ దేవ‌ర కొండ‌, రీతూ వర్మ జంటగా రూపొందిన ఈ చిత్రం జూలై 29, 2016న విడుద‌లై సూపర్‌హిట్ట‌య్యింది. ఇటు ప్రేక్ష‌కులు, అటు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల నుండి ఈ సినిమాకు మంచి ప్ర‌శంస‌లు దక్కాయి. అయితే పెళ్ళి చూపులు చిత్రాన్ని ఆ మధ్య బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిందీలో రీమేక్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కాని ఈ చిత్రాన్ని తమిళం, కన్నడలోను రీమేక్ చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది. అయితే తమిళ సినిమా రీమేక్ రైట్స్ ను గౌతమ్ మీనన్ సొంతం చేసుకోగా, తాజాగా ఈ తమిళ చిత్రానికి పొన్ ఒండ్రు కండెన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. విష్ణు విశాల్, తమన్నా ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్ వీరసామి తెరకెక్కించనున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇక కన్నడ రీమేక్ లో గురునందన్, శ్రద్ధా శ్రీనాథ్‌లు హీరో హీరోయిన్లుగా నటించనున్నారని తెలుస్తోండగా ఈ చిత్రాన్ని డ్యాన్స్ మాస్టర్ కమ్ డైరెక్టర్ మురళీ తెరకెక్కించనున్నాడని చెబుతున్నారు. మరి ఈ విషయంపై క్లారిటీ రావలసి ఉంది.1606
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles