ఆన్‌స్క్రీన్ శ‌త్రువులం.. ఆఫ్‌స్క్రీన్ సోద‌రులం

Sun,November 4, 2018 07:12 AM
 Vivek Anand Oberoi tweet goes viral

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న 12వ చిత్రంగా బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. అతి త్వ‌ర‌లో మూవీ ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేయ‌నున్నారు. అయితే రీసెంట్‌గా చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషిస్తున్న వివేక్ ఒబేరాయ్ పార్ట్ ముగిసింది. దీంతో ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా చెర్రీతో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ షూటింగ్ అనుభవాల‌ని వివ‌రించాడు. కెమెరా ముందు రామ్ చ‌ర‌ణ్, నేను వారియ‌ర్స్‌.. కెమెరా వెనుక సోద‌రులం. శ‌నివారం రోజు నా లాస్ట్ డే షూటింగ్‌. చాలా గొప్ప ఎక్స్‌పీరియెన్స్ వ‌చ్చింది. ప్ర‌తి క్ష‌ణం ఆనందంగా గ‌డిచింది. నా సోద‌రుడు రామ్ చ‌రణ్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం సంతోషంగా ఉంది. నువ్వు చూపించిన ప్రేమ‌, అభిమానం, ఆద‌ర‌ణ‌కి ధన్యవాదాలు. గొప్ప న‌టులు చిరంజీవిగారిలో ఉన్న క్వాలిటీస్ ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్‌లో ఉన్నాయంటూ ట్వీట్‌లో తెలిపాడు వివేక్. చిత్రానికి విన‌య విధేయ రామ అనే టైటిల్ ప‌రిశీలిస్తుండ‌గా ఈ మూవీలో స్నేహ,ఆర్యన్‌ రాజేశ్‌ తదితరులు నటిస్తున్నారు. కైరా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్ర లు నటిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్ర షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది.2785
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles