ప్ర‌ముఖ క‌మెడీయ‌న్‌కి మాతృవియోగం

Thu,July 18, 2019 08:35 AM
Vivek mother passes away

త‌న కామెడీతో త‌మిళ ప్రేక్షకుల‌తో పాటు తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన క‌మెడీయ‌న్ వివేక్. శివాజీ, అప‌రిచితుడు వంటి అనువాద చిత్రాల‌తో ఈయ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యాడు. అయితే ఆయ‌న తల్లి మ‌నియ‌మ్మ‌ల్(86) అనారోగ్యంతో క‌న్నుమూశారు. కొద్ది రోజులుగా అస్వ‌స్థ‌తో బాధ‌ప‌డుతున్న ఆమె బుధ‌వారం చెన్నైలో క‌న్నుమూశారు. ఈ రోజు ఆమె స్వ‌స్థ‌లం శంక‌ర‌న్ కోవిల్‌లోని పెరుంగుట్టూర్‌లో అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. త‌మిళ ప్ర‌ముఖులు ఆమె మృతికి సంతాపం తెలియ‌జేస్తూ వివేక్ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఆయ‌న ప్ర‌స్తుతం ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉండ‌గా, తల్లి మృతితో కొద్ది రోజుల పాటు వాటికి బ్రేక్ ఇచ్చాడు.

2014
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles