క్ష‌మించ‌మ‌ని కోరిన రీల్‌లైఫ్ మోదీ

Tue,May 21, 2019 10:33 AM
Vivek Oberoi Apologises Amid Anger Over Aishwarya Rai Meme

భారత ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ జీవిత నేప‌థ్యంలో ‘పీఎం నరేంద్ర మోదీ’ అనే బ‌యోపిక్ తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే . ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌.. మోదీ పాత్ర పోషిస్తున్నారు. మేరీకోమ్‌, సరబ్‌జిత్‌ వంటి చిత్రాలు తీసిన ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. మే 24న ఈ చిత్రం విడుద‌ల కానుంది. అయితే చిత్ర ప్ర‌ధాన పాత్ర ధారి వివేక్ ఒబేరాయ్ సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొట్టిన ఓ ఫోటోపై ఫ‌న్నీగా స్పందించారు. ఈ వివాదం కాస్త పెద్ద‌దిగా కావ‌డంతో చివ‌ర‌కి క్ష‌మాప‌ణ‌లు చెప్పి, తాను చేసిన ట్వీట్‌ని డిలీట్ చేశాడు.

ఈ ఆదివారం ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు వెలువ‌డిన నేప‌థ్యంలో ఓ నెటిజ‌న్ స‌ల్మాన్, వివేక్ ఒబేరాయ్, అభిషేక్‌తో ఉన్న ఐష్ ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. సల్మాన్‌-ఐష్‌ ఉన్న ఫొటోపై ‘ఒపీనియన్‌ పోల్‌’ అని, ఐష్‌-వివేక్‌ ఫొటోపై ‘ఎగ్జిట్‌ పోల్‌‌’ అని, ఐష్‌-అభిషేక్‌ ఉన్న ఫొటోపై ‘ఫలితాలు’ అని రాసుంది. దీనికి వివేక్‌ క్యాప్షన్‌గా.. ‘హ హ.. క్రియేటివ్‌.. ఇది రాజకీయం కాదు. కేవలం జీవితం’ అని రాశారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. సోన‌మ్ క‌పూర్, గుత్తా జ్వాలా, మ‌ధుర్ బండార్క‌ర్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు వివేక్ చ‌ర్య‌ని త‌ప్పు ప‌ట్టారు. మహారాష్ట్రకు చెందిన మహిళా కమిషన్‌ వివేక్‌పై కేసు కూడా నమోదు చేసింది. ఈ నేప‌థ్యంలో త‌న ట్వీట్‌ని డిలీట్ చేసి క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు వివేక్.

కొన్ని విష‌యాలు మ‌నకు స‌ర‌దాగా అనిపిస్తాయి. అవి వేరే వాళ్ళ‌కి సీరియ‌స్‌గా ఉంటాయి. గ‌త ప‌దేళ్ళ‌లో రెండు వేల మందికి పైగా పేద ఆడ‌పిల్ల‌ల‌కి అండ‌గా నిలిచాను. నేను మ‌హిళల‌ ప‌ట్ల అగౌర‌వంగా ఉంటాన‌నే మాట‌లు ఊహించ‌లేను. ఎవ‌రో క్రియేట్ చేసిన ఫోటోపై స‌ర‌దాగా రిప్లై ఇవ్వ‌డం వ‌ల‌న ఓ మ‌హిళ బాధ‌ప‌డుంటే క్ష‌మించాల్సిందిగా కోరుతున్నాను. ట్వీట్ కూడా తొల‌గించేసాను అని వివేక్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

2224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles