భైర‌వ‌గీత‌కి ఓటేయండంటున్న వ‌ర్మ‌

Wed,November 28, 2018 10:56 AM
vote for Bhairava Geetha

త‌న ప్ర‌తి సినిమాని వినూత్నంగా ప్ర‌మోట్ చేసుకునే వ‌ర్మ తాను స‌మ‌ర్పిస్తున్న భైర‌వ గీత చిత్రానికి కావ‌ల‌సినంత ప‌బ్లిసిటీ తీసుకొచ్చాడు. ఇటీవ‌ల జ‌రిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో 2.0 చిత్రం చిన్న పిల్ల‌ల సినిమా అంటూ భైర‌వ‌గీత‌పై హైప్ పెంచే ప్ర‌యత్నం చేశాడు. నవంబ‌ర్ 30న ఈ చిత్రాన్ని 2.0కి పోటీగా విడుద‌ల చేయాల‌ని ముందుగా భావించిన‌ప్ప‌టికి, సెన్సార్ స‌మ‌స్య‌తో పాటు ప‌లు సాంకేతిక కార‌ణాల వ‌ల‌న ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్న‌ట్టు రామ్ గోపాల్ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ఓటింగ్ రోజున అంటే డిసెంబ‌ర్ 7న భైర‌వ గీత ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. భైర‌వ‌గీత‌కి ఓటు వేసి గెలిపించండి అని అన్నారు ఆర్జీవి. రామ్ గోపాల్ వ‌ర్మ శిష్యుడు సిద్ధార్ద్ తాతోలు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం వాస్త‌వ ఘ‌ట‌న‌లు ఆధారంగా తెర‌కెక్కింది. ఈ ప్రేమ క‌థ చిత్రంలో ధనుంజయ్, ఇర్రామోర్‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. చిత్ర టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో మూవీపై కూడా భారీ ఎక్స్‌పెక్టేష‌న్సే ఉన్నాయి.




1332
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles