రైతుగా క‌నిపించ‌నున్న వివి వినాయ‌క్

Thu,September 19, 2019 11:48 AM

క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ని తెర‌కెక్కించే మాస్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ త్వ‌ర‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న‌సంగ‌తి తెలిసిందే. శరభ ఫేం నరసింహారావు డైరెక్షన్‌లో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం కాగా, ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 9న‌ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు టాక్. అక్టోబ‌ర్ 9 వినాయ‌క్ బ‌ర్త్‌డే కావ‌డంతో ఆ రోజే చిత్ర షూటింగ్ ప్రారంభించాల‌ని మేక‌ర్స్ అనుకుంటున్నార‌ట‌. పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్క‌నున్న ఈ సినిమా కథ 1940ల కాలం నాటికి సంబంధించిన‌దిగా ఉంటుంద‌ని తెలుస్తుంది. చిత్రంలో రైతుగా వినాయ‌క్ అల‌రించ‌నున్నాడ‌ని తాజా స‌మాచారం. గ‌త కొద్ది రోజులుగా వినాయ‌క్ జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తూ స్లిమ్‌గా మారారు. హీరోగా ఆయ‌న ఎలా అల‌రిస్తాడా చూడాల‌ని అభిమాన‌లు ఉవ్విళ్లూరుతున్నారు. వివి వినాయక్ ఇప్పటికే ఠాగూర్, ఖైదీ నంబర్ 150, నేనింతే చిత్రాల్లో గెస్ట్ రోల్స్‌లో కనిపించిన విష‌యం తెలిసిందే.


వినాయ‌క్ చిత్రంలో హీరోయిన్ గా ప్రముఖ నటి శ్రియ నటిస్తుందని సమాచారం . దీనిని చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించాల్సి ఉంది . గతంలో వినాయక్ దర్శకత్వంలో శ్రియ చెన్నకేశవరెడ్డి ,ఠాగూర్ సినిమాల్లో నటించింది. 2018లో వచ్చిన ఇంటిలిజెంట్‌ సినిమాకు వినాయక్‌ చివరగా దర్శకత్వం వహించారు. సాయి ధరమ్‌తేజ్‌ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది.

1262
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles