క‌థానాయ‌కుడిగా సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు..!

Tue,May 14, 2019 10:41 AM

మాస్ చిత్రాల‌కి కేరాఫ్ అడ్రెస్ వివి వినాయ‌క్. మాస్ క‌థాంశాలని స్టార్ హీరోల‌తో కూడా చిత్రీకరించి క‌మ‌ర్షియ‌ల్ విజ‌యాలు సాధించాడు వినాయ‌క్. చివ‌రిగా ఖైదీ నెం 150 చిత్రం ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కి మంచి విజ‌యం అందించింది. అదుర్స్ చిత్రం త‌ర్వాత వినాయ‌క్ తెర‌కెక్కించిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. 2018లో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా ఇంటెలిజెంట్ అనే చిత్రానికి చివ‌రిగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ ల‌భించింది. అయితే వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఓ ప్రాజెక్ట్‌పై ఇటీవ‌ల ప‌లు వార్త‌లు రాగా, దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. కాని ఆయ‌న వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో హీరోగా ఓ సినిమా చేయ‌బోతున్నాడంటూ ప్ర‌స్తుతం ఓ వార్త షికారు చేస్తుంది. దర్శకుడు శంకర్‌ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్‌. నరసింహారావు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. మ‌రో రెండు నెల‌ల్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుంద‌ని అంటున్నారు. మ‌రి సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌ని హీరోగా.. అప్‌క‌మింగ్ డైరెక్ట‌ర్ ఎలా చూపించనున్నాడనేది ఆస‌క్తిగా మారింది.

1608
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles