చిరు ఆశీర్వాదం తీసుకున్న తేజూ, వినాయక్

Wed,August 9, 2017 01:10 PM
VV VINAYAK  taking blessings to chiru

మెగాస్టార్ చిరంజీవి క‌మ్ బ్యాక్ చిత్రం ఖైదీ నెం 150తో బాక్సాఫీస్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు వివి వినాయ‌క్. ప్ర‌స్తుతం చిరు మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తో ఓ మూవీ ప్లాన్ చేశాడు . ఈ మూవీ నేడు పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. చిత్ర యూనిట్ కి సంబంధించిన కొంద‌రు లాంచింగ్ కార్య‌క్ర‌మం పూర్తైన త‌ర్వాత‌ చిరు స్వ‌గృహానికి వెళ్ళి ఆయ‌న ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రముఖ రచయిత ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ లు స్క్రీన్ ప్లే అందించ‌నున్నారు. తేజూ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయికగా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. మొన్న‌టి వ‌ర‌కు జ‌వాన్ చిత్రంతో బిజీగా ఉన్న తేజూ ఈ చిత్ర షూటింగ్ ఇటీవ‌లే పూర్తి చేసుకున్నాడు. సెప్టెంబ‌ర్ 1న జ‌వాన్ విడుద‌ల కానుంది. త్వ‌ర‌లోనే వినాయ‌క్- తేజూ కాంబోలో రూపొంద‌నున్న చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. తిక్క‌, విన్న‌ర్,న‌క్ష‌త్రం ఇలా వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న సాయిధ‌ర‌మ్ తేజ్ కి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైనర్ తో మంచి విజ‌యాన్ని అందించాల‌ని భావిస్తున్నాడట మాస్ డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్. ఈ చిత్రం కోసం ‘ఇంటలిజెంట్’ అనే టైటిల్‌ను ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు దుర్గ అనే టైటిల్‌ను కూడా చిత్రయూనిట్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి


1866
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles