పర్యావరణాన్ని మనమే బాగుచేయాలి: సోనాలి బింద్రే

Tue,September 10, 2019 06:45 PM
We must improve the environment: Sonali Bindre

ముంబయి: బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన నటి సోనాలి బింద్రే. క్యాన్సర్‌కు గురై, చికిత్సానంతరం కోలుకున్న ఈ భామ వినాయక చవితి, నిమజ్జనం గురించి కొంత ఆనందంగా, మరికొంత ఆందోళనకరంగా ఉందంటూ ట్విట్టర్ ద్వారా తెలిపింది. గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టాపన, నిమజ్జనం తర్వాత జరిగే పరిణామాలను వివరిస్తూ.. పోయినేడాది క్యాన్సర్ కారణంగా గణేష్ చతుర్థిని ఇంట్లో జరుపుకోలేను. దానికి చాలా చింతించాను. ఈ సారి భగవంతుడి దయతో తన ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టించి, ఘనంగా పూజలు జరుపుకున్నామన్నారు.

కానీ, నిమజ్జనం అనంతరం నీటిని విపరీతంగా కలుషితం చేస్తున్నామని ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది. దేవుడి విగ్రహాలతో పాటు, పూజ సామాగ్రిని అక్కడే వేయడంతో నీటిని విపరీతంగా కలుషితం చేస్తున్నామనీ, ఈ పరిస్థితి మారాలని ఆమె కోరారు. వ్యర్థాలను నీటిలో వేయరాదని ఆమె విన్నవించారు.

ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ఇకనుంచి సింగిల్ ప్లాస్టిక్ కూడా వాడకూడదని, ప్రపంచాన్ని కబలించే ఈ మహమ్మారిని దేశం నుంచి తరిమేయాలని ఆయన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.1091
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles