ఈసీ సమాధానంతో సంతోషంగా ఉన్నాం..

Thu,April 18, 2019 04:18 PM
we were happy with EC answer Vivek Oberoi on PM Narendra Modi movie


ఎన్నికల సంఘం అధికారుల బృందం పీఎం నరేంద్రమోదీ చిత్రాన్ని ప్రత్యేక షో ద్వారా వీక్షించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటుడు వివేక్ ఒబెరాయ్ మీడియాతో మాట్లాడుతూ..ఈసీ బృందం నిన్న సినిమాను చూసింది. సినిమా మీకు ఎలా నచ్చిందని అని వారిని అడిగాం. అధికారులు మాత్రం ఏ విషయం చెప్పలేదు. కానీ వారిచ్చిన సమాధానంతో మేము సంతోషంగా ఉన్నామని అన్నాడు. సినిమాను విడుదల చేసేందుకు సహకరించాలని వివేక్ ఒబెరాయ్ ఈసీని విజ్ఞప్తి చేశాడు.

ఒమంగ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కించిన 'పీఎం నరేంద్రమోదీ' చిత్రంలో వివేక్ ప్రధాన పాత్రలో నటించాడు. బొమన్ ఇరానీ, మనోజ్ జోషీ, కిశోర్ షహానే, దర్శన్ కుమార్ ఇతర పాత్రలో కనిపించనున్నారు. ప్రధాని మోదీ జీవితం ఆధారంగా 'పీఎం నరేంద్రమోదీ' సినిమాను నిర్మించారు.

2601
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles