మమ్ముట్టి డ్యాన్స్ చేయడని ఎవరన్నారు?

Sat,July 30, 2016 10:48 AM

లెజండరీ నటుడు మమ్ముట్టికి మాలీవుడ్‌లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పర్‌ఫెక్ట్ డైలాగ్స్‌తో, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేస్తాడు మమ్ముట్టి. అయితే మమ్ముట్టి బాడీ డ్యాన్స్ చేయడానికి వీలుగా ఉండదని కొందరి వాదన. మరి కొందరైతే ఆయనకు డ్యాన్స్ రాదని కూడా అంటారు. కాని రీసెంట్‌గా లీకైన వీడియో చూస్తే మమ్ముట్టికి డ్యాన్స్ రాదని ఎవరు అనరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ లా పాకుతున్న వీడియోలో ఓ స్టేజ్‌పై అప్పటి నటి సుకుమారి పాట పాడుతుండగా, మమ్ముట్టి డప్పన్ కూతు స్టైల్‌లో స్టెప్పులేస్తూ కనిపించారు. ఎంతో జోష్‌తో స్టెప్పులేస్తున్న మమ్ముట్టిని చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.


1740
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles