స‌వ్య‌సాచి మొద‌టి సాంగ్‌కి ముహూర్తం ఖ‌రారు

Sun,October 7, 2018 12:47 PM

నాగ చైత‌న్య‌, చందూ మొండేటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం స‌వ్య‌సాచి. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చైతూ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ‘ప్రేమమ్’ చిత్రం తరువాత చందు మొండేటి, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్నఈ సినిమాపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. స‌వ్య‌సాచి అంటే రెండు చేతుల‌ని స‌మ‌ర్ధ‌వంతంగా, శ‌క్తివంతంగా వాడే వాళ్ళు అని అర్ధం. ఈ చిత్రంలో చైతూ త‌న రెండు చేతుల‌ని స‌మ‌ర్ధ‌వంతంగా వాడి ప‌రిస్థితుల‌ని, ప్ర‌త్య‌ర్ధుల‌ని ఎదుర్కొంటాడు అని చూపించ‌నున్నారు.


ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మాధ‌వ‌న్, భూమిక‌లు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌ల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక‌ ఈ నెల 9న ఉదయం 11 గంటలకు ‘వై నాట్‌’ తొలి లిరికల్‌ పాటని విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ కొత్త పోస్టర్లను విడుదల చేసింది. తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు రాని ఓ సరికొత్త కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. న‌వంబ‌ర్ 2న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు. వెన్నెల కిషోర్‌, సత్య, రావు రమేష్‌, తాగుబోతు రమేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

2287
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles