బాల‌య్య చ‌నిపోయిన‌ట్టు క‌న్‌ఫాం చేసిన వికీపీడియా

Tue,October 9, 2018 08:14 AM
Wikipedia shocking to balayya fans

కంప్యూట‌ర్ యుగంలో ప్ర‌తి నెటిజ‌న్ గూగుల్‌నే న‌మ్ముకొని స‌గం ప‌నులు స‌క్క‌పెట్టుకుంటున్నాడ‌నే సంగ‌తి తెలిసిందే. ఒక్కోసారి గూగుల్ లేక‌పోతే ప్రపంచం ఏమైపోతుందో అనే అనుమానం స‌గ‌టు మ‌నిషికి రాక మాన‌దు. గూగుల్‌కి సంబంధించిన వాటిలో ఎన్నో త‌ప్పులు దొర్లుతున్నా కూడా మ‌నిషి మాత్రం దానిపైన ఆధార‌ప‌డ‌డం మాన‌డం లేదు. అయితే తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ‌ని బ్ర‌తికి ఉండ‌గానే చంపేసిన ఘ‌న‌త వికీపీడియా సొంతం చేసుకుంది. గూగుల్‌లో నందమూరి బాలకృష్ణ పేరుతో ఉన్న వికీపీడియాలో ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుపరిచారు.

పుట్టిన తేదీతో పాటు మ‌ర‌ణించిన తేదీ కూడా ఉండ‌డంతో ఇది చూసి షాక్ కావ‌డం అంద‌రి వంతు అయింది. 23 ఏళ్ల క్రితమే అనగా.. 1995లోనే ఆయన మరణించినట్టుగా వికీపీడియాలో దర్శనం ఇచ్చింది. బెంగుళూరులో మరణించినట్టుగా ప్లేస్ కూడా డిసైడ్ చేసేశారు. కొద్ది సేప‌ట్లోనే ఈ వార్త వైర‌ల్‌గా మార‌డంతో బాల‌య్య అభిమానులు ఆగ్ర‌హంతో ఊగిపోయారు. జ‌రిగిన త‌ప్పుని స‌రిచేసుకునే లోపే జ‌ర‌గ‌రానిదంతా జ‌రిగిపోవ‌డంతో ఫ్యాన్స్ గూగుల్‌కి హెచ్చ‌రిక‌లు పంపారు.ఎట్ట‌కేల‌కు కొద్ది సేప‌టి త‌ర్వాత బాల‌య్య డెత్‌డేట్‌ని తొల‌గించి అభిమానుల ఆవేశాన్ని చ‌ల్లార్చారు. అయితే అస‌లు త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందంటే కన్నడ నటుడు టీఎన్ బాలకృష్ణ 1995లో మరణించారు. ఆయన సమాచారాన్ని పొర‌పాటున నందమూరి బాలకృష్ణ వికీపీడియాలో జతచేయడంతో వివాదం రేగింది.

14156
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles